అల్సెన్స్‌ హై స్కూల్‌లో ప్రమాదం

26 Oct, 2018 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని అల్సెన్స్‌ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లంచ్‌ అవర్‌ కావడంతో పేను ప్రమాదం తప్పింది. వివరాలు.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాఠశాలలోని పరేడ్‌ స్టేజ్‌ క్రింద ఉన్న గది నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది. ఈ సమయంలో స్కూల్‌ ఆవరణలో దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే లంచ్‌ అవర్‌ కాండంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ దట్టమైన పోగ రావడం వల్ల ఏడుగురు విద్యార్థులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వీరిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుంది.

సమాచారం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకోచ్చారు. ఈ సంఘటన గురించి యాజమాన్యం మాట్లాడుతూ..‘ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది. విద్యార్థులేవరికి ఏమి కాలేదు. కానీ దట్టమైన పోగ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించాం. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళన పడవద్దని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు