కరోనా.. ఇక చలోనా..

30 Jun, 2020 08:54 IST|Sakshi

ఇంటా బయట ఒక్కటే మాట కరోనా.. వాళ్లకొచ్చింది.. వీళ్లకొచ్చిందంటూ నిత్యం ఆందోళన.. ఒకవేళ కరోనా పాజిటివ్‌ వచ్చినా కంగారు పడకుండా నెగెటివ్‌ ఆలోచనలు మర్చిపోవాలి. మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదని అంటున్నారు డిజైనర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిల్పారెడ్డి. తాజాగా కరోనా పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌గా మారడం వెనుక తాను తీసుకున్న జాగ్రత్తలు, చేసిన కసరత్తులు వివరిస్తున్నారిలా.. వైద్యుల సూచనలు అనుసరిస్తూనే మనం కూడా వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చంటున్నారు. 

గుడ్‌ ఫుడ్‌.. 
శరీరంలోని జీర్ణవ్యవస్థపై అధిక భారం మోపని పరిశుభ్రమైన తేలికపాటి హోమ్‌ ఫుడ్‌ తీసుకోవడం మంచిది.  తీపి పదార్థాలకు పూర్తిగా దూరం కావాలి. ఆహారంలో.. 1000 మి.గ్రా. సి విటమిన్‌ అలాగే 40–50 మి.గ్రా జింక్‌ ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటే ఒక ప్రొబయోటిక్‌ క్యాప్సూల్‌ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు డి విటమిన్‌ స్థాయిలు తనిఖీ చేసుకోవాలి. అవసరమైనంత లేకపోతే దాన్ని సూర్యరశ్మి ద్వారా సహజంగా పొందడానికి ప్రయత్నించాలి. వేడినీళ్లు లేదా రూమ్‌ టెంపరేచర్‌కు సమానంగా ఉన్న నీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. నీళ్లలో పుదీనా ఆకులు లేదా తులసి, చిటికెడు పసుపు మేళవించడం మరింత మంచిది. ఐస్‌ లేదా చల్లని పానీయాలు, ఫ్రిజ్‌ వాటర్‌.. పూర్తిగా మానేయాలి.  

5  గార్లిక్‌  
7– 8  క్లోవ్స్‌ 
15  తులసి ఆకులు లేదా 20     బాసిల్‌ ఆకులు 
1  టీ స్పూన్‌ అజ్వాయిన్‌ 
5  పుదీనా ఆకులు 
10 బాయిల్డ్‌ బ్లాక్‌ పెప్పర్‌ 

కసరత్తు.. మరువద్దు.. 
రోజుకి 10 నిమిషాల పాటు బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయాలి. దీని కోసం యూట్యూబ్‌లో సులభమైన ప్రాణయామ పద్ధతులు అనుసరించవచ్చు. ఇషా క్రియ లేదా చిట్‌ శక్తిలతో ధ్యాన సాధన ప్రారంభించడం మంచిది. దీనిని నేను ప్రయత్నించి ఫలితం పొందాను. రోజుకి రెండుసార్లు సింహక్రియ సాధన చేయండి. ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది చాలా సింపుల్‌. కేవలం 3 నిమిషాల వ్యవధిలో చేయవచ్చు. వీటి కోసం యూట్యూబ్‌లో విభిన్న భాషల్లో అందుబాటులో ఉన్న వీడియోలు వినియోగించుకోవచ్చు. 

క్లీన్‌.. విన్‌.. 
పరిశుభ్రత చాలా ముఖ్యం. మన ముక్కు, గొంతు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఒకసారి పడుకునే ముందు ఒక సారి ఆవిరిపట్టాలి. ముక్కు ద్వారా 20 నుంచి 25సార్లు శ్వాస పీల్చాలి. అలాగే నోటి ద్వారా కూడా చేయాలి.  రోజూ కాసేపు శారీరక శ్రమ చేయాలి. సబ్బు లేదా మరేదైనా క్రిమి సంహారక ఉత్పత్తితో చేతులను తరచూ శానిటైజ్‌ చేసుకోవడం, ముక్కుపై వరకూ మాస్క్‌ ధరించడం, ఇతరులతో, ఉన్నప్పుడు, సమూహంలోకి పోకుండా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పనిసరి. త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం వంటివి అలవాటు చేసుకోవాలి.  

వైద్యుల సలహా మేరకు..  
ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వైద్య సలహా మేరకు ఫ్లూ నివారణి తీసుకోవచ్చు. నా వైద్యుడితో సంప్రదించి ఆయన సలహా మేరకు సాధారణ జలుబు, దగ్గుల వంటివి వచ్చినా భయాందోళనకు గురికాకుండా ఉండేలా ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ తీసుకున్నా. పిల్లలకు, పెద్దలకు వేర్వేరు పరిమాణాల్లో ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. మన ఇంట్లో మనతో పాటుగా పెద్ద వయసువాళ్లు ఉంటే ఇది మరింత అవసరం.  

మరిన్ని వార్తలు