ఫ్లడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

18 Aug, 2018 14:08 IST|Sakshi
రక్షణ చర్యలకు సిద్ధంగా ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 

వరదల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు

హెల్ప్‌లైన్‌ నంబర్ల ప్రకటన

జిల్లాలో 15 టీంల ఏర్పాటు

సమస్యాత్మక ప్రాంతాల్లో క్యాంపులు

సాక్షి, భూపాలపల్లి : జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు.. గోదావరి నీటిమట్టం పెరగడం.. వరద వస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయం కేంద్రంగా ఫ్లడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. దానికి ఏటూరునాగారం తహసీల్దార్‌ను ఇన్‌చార్జి గా నియమించారు. 24 గంటలు అధికారులు చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించడంతోపాటు సమాచారాన్ని కంట్రోల్‌ రూం ద్వారా కలెక్టర్‌ సమీక్షించనున్నారు. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నిత్యం కురిసిన వర్షపాతాన్ని నమోదుచేయనున్నారు.

ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(టీడబ్ల్యూయూ) అధికారిని ఏటూరునాగారం మండలానికి నోడల్‌ అధికారిగా నియమించారు. వరద ప్రమాదాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడానికి వివిధ శాఖల అధికారులను 15 టీంలుగా విభజించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీంటను అప్రమత్తం చేశారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగి ప్రజలను పునరావాస కేం ద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు.

2, 3 ప్రమాద హెచ్చరికలు దాటితే మొదటి టీం ఏటూరునాగారంలోని హరిజనవాడ, నందమూరినగర్, నేతకానివాడ, రెండో టీం వాడగూడెం, మూడో టీం కుమ్మరివాడలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించానికి ప్రణాళికలు రూపొందిం చారు. వరద తీవ్రత నుంచి రక్షించుకునేలా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరునాగా రం ఐటీడీఏ, పోలీస్‌ల సహకారంతో వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా ముందస్తుగానే గజ ఈతగాళ్లను, రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. 

హెల్ప్‌లైన్‌ సెంటర్ల ఏర్పాటు

వరద భారీ నుంచి ప్రజలను రక్షించడానికి అధికారులకు తక్షణ సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కార్యాలయంలో 08713248080, ఏటూరునాగారంఐటీడీఏలో 7901091265 / 08717231247, 08717231246, తహసీల్దార్‌ కార్యాలయంలో 7680906616 / 08717231100, మహదేవపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో 9652608367 హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు