చార్‌ధామ్ యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు

28 Jun, 2015 02:35 IST|Sakshi

ఉత్తరాఖండ్ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి  భారీ వర్షాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘల్, అడిషనల్ ఆర్సీ అర్జా శ్రీకాంత్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఏపీ భవన్ ఓఎస్డీ ఎం.అశోక్‌బాబు (9871999051), ఏపీ పర్యాటక సహాయ సంచాలకులు జి.రామకోటయ్య (9810981293) హరిద్వార్. గోవర్ధన్‌నాయుడు (8171503333) జోషిమఠ్ వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేయాలని రిషికేశ్‌లోని టీటీడీ ఆశ్రమ ఇన్‌ఛార్జిలు ఓంకార్, జనార్దన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

మరిన్ని వార్తలు