8 ఏళ్ల తర్వాత నిండిన కోయిల్‌సాగర్

10 Oct, 2017 16:18 IST|Sakshi

8 గేట్లు ఎత్తివేత

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్ జిల్లాలో గల కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు 8 గేట్లను అధికారులు మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయింది. అయితే... ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో ప్రాజెక్టుకు చెందిన 8 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కాగా... కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2009 తర్వాత మళ్లీ ఇపుడు నిండింది. అప్పట్లో ప్రాజెక్టు నిండడంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ 8 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండింది.

మరిన్ని వార్తలు