జూరాల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

4 Sep, 2019 16:26 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌ నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఇన్‌ ప్లో 26,000 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ప్లో 29,614గా నమోదైంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 8.670 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 318.030 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు.  మూడు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పాదన కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు