జెడ్పీటీసీ ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సోదాలు

7 Dec, 2018 14:04 IST|Sakshi
పంచనామా నిర్వహిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం

రూ.4.5లక్షలు సీజ్‌ పోలీసులతో

కాంగ్రెస్‌ నాయకుల వాగ్వాదం

ఈటల రాజేందర్‌కు     వ్యతిరేకంగా నినాదాలు

జమ్మికుంటరూరల్‌:  జమ్మికుంట జెడ్పీటీసీ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం..పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించడం నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం గురువారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.4.5లక్షలను పంచనామా నిర్వహించి సీజ్‌ చేశారు. తనిఖీల్లో ఫ్లయింగ్‌ స్వాడ్‌ అధికారి(ఎంపీడీవో) జయశ్రీతో పాటు బృందం సభ్యులు పాల్గొన్నారు.

పోలీసులతో కాంగ్రెస్‌ నాయకుల వాగ్వివాదం..
జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం ఇంట్లో తనిఖీలు జరుతున్నాయన్న వార్త దావానంలా వ్యాపించటంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వీరేశలింగం ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటి ముందు ఉన్న రెండు గేట్లను మూసివేసి తనిఖీలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యక్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇంతలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేరుకోవడంతో కార్యక్తలు ఒక్కసారిగా గేటును తోసుకొని వీరేశలింగం ఇంట్లోకి చొచ్చుకువెళ్లారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డికి, స్థానిక సీఐ సృజన్‌కుమార్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల యంత్రాంగం, పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా ప్రభుత్వానికి, ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే వీరేశలింగం ఇంటి చుట్టూ అదనపు బలగాలను కాపలాగా ఉంచి తనిఖీలు నిర్వహిస్తుండటంతో ప్రధాన రహదారిన వెళ్లే వాళ్లందరూ గుమిగూడారు. పోలీసులు పెద్దెత్తున మోహరించడంతో ఏం జరిగిందోనని పలువురు ఆసక్తికరంగా చూశారు.

డప్పులతో నిరసన..
వీరేశలింగం గతంలో టీఆర్‌ఎస్‌ ఉండి ఆ పార్టీ తరఫుపున జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే 2014 లో అప్పటి ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన డప్పులు ఇప్పటికీ వీరేశలింగం ఇంట్లో దర్శనమిచ్చాయి. అయితే ఆ డప్పులను కూడా అధికారులు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నాయకులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అ« దికారులతో గొడవకు దిగారు. అయితే అధికారు లు డప్పులను తీసుకెళ్లేందుకు నిరాకరించడం తో కాంగ్రెస్‌ నాయకులు డప్పులతో నిరసన వ్య క్తం చేశారు. చివరకు అధికారులు డప్పులను తమ వెంట తీసుకెళ్లడంతో గొడవ సద్దుమనిగింది. 

మరిన్ని వార్తలు