రాష్ట్రంలో జిల్లాకు మూడవ స్థానం

29 Apr, 2015 02:43 IST|Sakshi

- ఇంటర్ ద్వితీయలో మెరుగైన ఫలితాలు
- బాలికలదే హవా
- కాకతీయ’కు బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
- ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఉత్తీర్ణత
నిజామాబాద్ అర్బన్ :
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చటారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. బాలుర కంటే బాలికలే పైచేరుుగా నిలిచారు. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 23,970 మంది పరీక్షలకు హాజ రు కాగా, 13,742 మంది (57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. బాలురు 15,598కి గాను 5,855 మంది (50 శాతం), బాలిక లు 12,732 మందికి గాను 7,887 మంది (64 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ ఏడా ది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడా ది 59.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 68.20 శాతానికి పెరగడం విశేషం. అరుుతే ఎయిడెడ్ కళాశాలల్లో మాత్రం గత ఏడాది కంటే మూడు శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత సంవత్సరం 18 శాతం కాగా, ఈ ఏడాది 15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. వోకేషనల్ ఫలితాల్లో ప్రస్తుతం 73.02 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, గత  ఏడాది 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 5719 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలు రాయగా, 1787 మంది(31 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

కాకతీయకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్...
జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన బి.సుష్మ బైపీసీ విభాగంలో 991/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ కళాశాల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 31 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇందులో 10లోపు నా లుగు ర్యాంకులు, 15లోపు తొమ్మిది ర్యాంకులు సాధించడం గమనార్హం. ఇదే కళాశాలకు చెందిన వైష్ణవి పవార్ ఎంపీసీ విభాగంలో 987/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు, జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. కృష్ణతేజ్ ఎంపీసీలో 985/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు.

బోధన్‌లోని విజయసాయి కళాశాలకు చెందిన సుష్మిత ఎంపీసీ విభాగంలో 985/1000 మార్కులు, ఇదే కళాశాలకు చెందిన సోనియఖన్నా బైపీసీలో 982/1000 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలకు చెందిన జి.అనుజ 984/1000 ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు, కె.అనూష 981/1000, ఎం.రాధిక లీల-981/1000, సౌబియ మెహిన-981/1000 రాష్ట్రస్థాయి 11వ ర్యాంకులు సాధిం చారు. కె.ప్రియాంక-980/1000 రాష్ట్ర స్థాయి 12వ ర్యాంకు, పవన్‌కళ్యాణ్ 979/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 13వ ర్యాంకు, ఎ.సంతోష్ 979/1000 బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి 13వ ర్యాంకు సాధించారు. పి.సాయివంశీ 978/1000 రాష్ట్ర స్థాయి 14వ ర్యాంకు, వి.సాహితీ -978/1000 , కె.సింధు 978/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 14వ ర్యాంకు సాధించారు.

కామారెడ్డికి చెందిన సందీపని జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కె.చలన ఎంపీసీ విభాగంలో 982/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. అలా గే బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కళాశాలకు చెందిన సాయివినయ్ ఎంపీసీ విభాగంలో 968/1000, రవళి 968/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో  ప్రతిభ కనబరిచారు. ఎంఈసీలో కామారెడ్డి సందీపని జూనియర్ కళాశాలకు చెం దిన కె.నిహారిక 965/1000 మార్కులు సాధించింది. సిఈసీలో సాగరిక 945/ 1000 మార్కులు సాధించింది. ఎంఈసీ విభాగంలో నిర్మలహృదయ్ జూనియ ర్ కళాశాలకు చెందిన బిష అగర్వాల్ 970/1000 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కళాశాలకు చెందిన ఈష ఆగర్వాల్ ఎంఈసీలో 968/1000 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు