పాకాలకు ‘విదేశీ చుట్టాలు’

13 May, 2019 02:34 IST|Sakshi

ఖానాపురం: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన పాకాలకు వేసవి కాలంలో అనేక రకాల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న పక్షుల వలసలు ప్రస్తుతం పెరిగాయి. వాటిని గుర్తించడానికి ప్రత్యేకంగా వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు పక్షులు సేదదీరడానికి అవసరమైన ఏర్పాట్లను ఖాజీపేట డీఎఫ్‌ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో చేపట్టారు.

వెరి డైట్‌ఫ్లై, క్యాచర్, పిగ్నిఉలిడక్, ఎల్లో వాట్‌ లెడ్, ల్యాప్‌వింగ్, రెడ్‌ అవైడవిట్, బార్‌ హెడ్‌ గీస్, ఆస్ప్రే, కామన్‌ ప్రొటైన్‌ కోల్, రెడ్‌ క్రాస్టెడ్, పోచార్ట్స్, బ్లూ టేబిల్డ్‌ బీ ఈటర్, విస్టింగ్‌ డక్స్, రోసే స్టార్లింగ్, చెస్ట నట్‌ హెడ్‌ బీ ఈటర్, రెడ్‌ నాఫ్ట్‌ ఇబస్, రివర్‌ టెర్న్, తిక్‌ బిల్డ్‌ గ్రీన్, నార్తర్న్‌ షోవ్లర్, కామన్‌ పోచర్డ్స్, కామన్‌ పిన్‌ టేల్స్, నార్తర్న్‌తోపాటు పలు ఇతర రకాల పక్షులు వేసవిలో ఇక్కడ సేదతీరుతున్నాయి.  

మరిన్ని వార్తలు