విభిన్న ఆలోచనలు.. విదేశీ కరెన్సీలు

10 Aug, 2015 01:55 IST|Sakshi
విభిన్న ఆలోచనలు.. విదేశీ కరెన్సీలు

అభిలాష్ అభిరుచి  120 దేశాల కరెన్సీ సేకరణ
రామటెంకీలు, ముద్ద,  చిల్లుపైసలు ఆయన సొంతం

 
కొందరు యువకులు కంప్యూటర్‌తో పరుగులు పెడుతున్నారు. తమ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. కానీ, చేర్యాలకు చెందిన ఉప్పల అభిలాష్ విభిన్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. దేశవిదేశాల కరెన్సీ సేకరించి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. సుమారు పదహారేళ్లుగా 120దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు సేకరించి భద్రపర్చుతున్నారు.  - చేర్యాల
 
సిద్దిపేట, తిమ్మాపురానికి చెందిన తన మేనమామ పడకంటి నాగరాజు స్ఫూర్తితో తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో ఈ పనికి పూనుకున్నారు. అభిలాష్ చేర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నప్పట్నుంచే విదేశాల నాణేలు, నోట్లు, స్టాంపుల సేకరణ ప్రారంభించారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, సౌత్‌ఆఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, యూఎస్‌ఏ, ఫిలిఫైన్స్, భూటాన్, దుబయ్, సౌదిఅరేబియా, రష్య, చైనా, ఘన, మలేషియా, సింగపూర్, జర్మనీ, ఇంగ్లడ్, ఫ్రాన్స్ తదితర 120 దేశాల నాణేలు, 80 దేశాల స్టాంపులు, 40 దేశాల కరెన్సీ తన వద్ద భద్రపర్చారు.

 వెరుు్య ఏళ్లనాటి నాణేలు భద్రం
 న్యూ మీస్ మ్యాటిక్ సొసైటీ సహకారంతో సుమారు వెరుు్య ఏళ్లనాటి నాణేలు అభిలాష్ సేకరించారు. ఇందులో ఇండియూలోని వెండి రామటెంకీలతో పాటు 400 క్రితం నాటి(1500-1600ఏళ్లనాటి ముద్దపైసలు), 1835 నాటి బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ(నిజాం సిక్క) నాణేలు, 1900 నాటి నిజాం హయూంలోని చార్మినార్ నాణెం నుంచి నేటి వరకు అన్ని నాణేలు సంపాదించారు. వీటిలో నిజాం హయూంలోని రూపారుులో 1/24 పైస నాణెం, ఈస్ట్ ఇండియా కంపెనీ వినియోగించిన రూపాయిలో 1/12 పైస నాణెం, ఇండియా కరెన్సీలోని నాణేలు, 1948 నుంచి నేటి వరకు అన్ని రకాల విదేశీ కరెన్సీ సేకరించారు. అభిలాష్ సేకరించిన ఫారిన్, ఇటలీ దేశాలతో పాటు యూరో, ఫౌండ్, దినార్, దిరాం, సెంట్ల, యూవాన్, రింగిట్, పైసో, లీరా, టెకా, ప్రాంకీ, రుప్పయలాంటివి ఉన్నారుు.

ఇండియాతో పాటు 80 దేశాల స్టాంపులు సైతం..
 అభిలాష్ సిలాటలి సొసైటీ గ్రపులతో కలిసి ఇండియాతో పాటు 80 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. 1947లో స్వాత్రంత్యం వచ్చాక వినియోగంలోకి వచ్చిన సుమారు ‘ఒక అణా’విలువైన స్టాంపుల నుంచి రూ.250 విలువైన అన్ని రకాల స్టాంపులు సంపాదించారు.

స్వాతంత్య్రానంతరం కూడా..
1947 స్వాత్రంత్య నాటి ముద్రగా ఉన్న ఒక్కరూపాయి నోటు నుంచి నేడు మార్కెట్‌లో చెలామణిలోని రూ.1000 విలువైన నోట్లు సేకరించారు. బెహరాన్‌కు చెందిన 1/4 బినాద్ (బెహరాన్‌కు చెందిన కరెన్సీ నోటు- ఇండియా కరెన్సీతో పోల్చితే రూ.40 కి సమానం). 1/4 దినార్ కువైట్‌కు చెందిన కరెన్సీ (ఇండియా రూ.40కి సమానం) వీటితో పాటు 40 దేశాల్లోని వివిధ రకాల కరెన్సీ నోట్లు అన్ని డిజైన్లవీ సేకరించారు.
 
 అనుభూతులు తెలిశారుు
 దేశవిదేశాల కరెన్సీ, స్టాంపుల సేకరణలో ఆ దేశస్తుల ఆచా ర వ్యవహారాలు, సంస్కృ తి, సంప్రదాయూలు, నా యకులు, అక్కడి చరిత్ర తెలిసింది. అన్నింటికీ మించి అక్కడి వారితో కొత్తమిత్రులు లభించారు. వీటి సేకరణ ద్వారా మహానాయకుల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. నా స్నేహితులు ఎంతో సహకరించారు.
 - అభిలాష్
 
 
 

మరిన్ని వార్తలు