అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..

3 Jun, 2020 05:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పర్యాటక వీసాలతో వచ్చి సెటిల్‌ అవుతున్న బంగ్లాదేశీయులు

ఇండోనేసియా, వియత్నాం నుంచీ అక్రమ రాకపోకలు

ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్న వైనం

ఆర్టీఐ ద్వారా వెల్లడించిన భారత విదేశాంగ శాఖ

పలువురు తెలంగాణలోనూ స్థిర పడుతున్నట్లు అనుమానం?

ఆధార్, డ్రైవింగ్, పాస్‌పోర్ట్, ఓటరు కార్డులు తీసుకుంటున్న విదేశీయులు 

మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్‌పోర్టు, ఆధార్‌ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు.

సాక్షి,హైదరాబాద్‌: విజిటింగ్‌ వీసాల పేరిట భారత్‌లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్‌ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్‌ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్‌ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్‌ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు ముఠాలు భారత్‌లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది.

9 లక్షలకు పైగానే..
తబ్లిగీ జమాత్‌ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్‌ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్‌ వీసాలపై భారత్‌లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్‌లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్‌లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

తెలంగాణలోనూ అధికంగా..!
వివిధ దేశాల నుంచి విజిటింగ్‌ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు