పోచంపల్లిలో విదేశీయుల సందడి

5 Dec, 2018 11:34 IST|Sakshi
టూరిజం పార్క్‌లో విదేశీయులు

సాక్షి, భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో విదేశీయులు సందడి చేశారు. మంగళవారం  హైదరాబాద్‌లోని సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో సెంట్రల్‌ అమెరికా, ఆఫ్రికా, ఘనా, సౌత్‌ ఆఫ్రికా, అఫ్ఘనిస్తాన్, టాంజానియా, జిం బాబ్వే, కజకిస్తాన్, ఈజిప్ట్, జోర్ధాన్, కాంగో దేశాలకు చెందిన 25 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థాని క గ్రామీణ వికాసబ్యాంకు సందర్శించి బ్యాంకు అంది స్తున్న సేవలు, స్వయం సహాయక గ్రూప్‌లు, రైతులు, చిరువ్యాపారులకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నారని, రుణాల చెల్లింపు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆర్థిక వికాసానికి బ్యాంకులు ఏ మేరకు పనిచేస్తున్నాయో ఆరా తీశారు. అనంతరం టూరిజం పార్క్‌ను సందర్శించారు. అక్కడ చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలైన నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలను పరిశీలించారు. ప్రాచీన చేనేత కళ, కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రామ్‌ డైరెక్టర్లు జి. సుదర్శన్, డాక్టర్‌ ఇ. విజయ మాట్లాడుతూ నిమిస్మేలో ‘సూక్ష్మ వ్యాపార విస్తరణ, అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. వీరికి స్థానిక టూరిజం మేనేజర్‌ జితేందర్‌ మార్గదర్శకం చేశారు. 

మరిన్ని వార్తలు