2022లో అటవీ జంతువుల గణన చేస్తాం

28 May, 2020 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్గొండ జిల్లాలో గురువారం ఓ  చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నామని అటవిశాఖ ఓఎస్డీ శంకరన్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటవీ జంతవులు జానావాసాలు, పంట పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు అధికంగా ఉండటంతో తాగటానికి జంతువులకు నీరు లేక జనావాసాల్లోకి చేరుతున్నాయని చెప్పారు. అభయ అరణ్యాల్లో అటవీ శాఖ తరఫున నీటి వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుతల సంఖ్య ఎంత అనేది ఇప్పడు కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. అడవి జంతువులను ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారని చెప్పారు. 2018లో అడవి జంతవులలను లెక్కించామని మళ్లీ 2022లో జంతుల గణన చేస్తామని ఓఎస్డీ శంకరన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు