హరితహారం సంతృప్తినిచ్చింది 

1 Mar, 2020 04:34 IST|Sakshi

పదవీ విరమణ సభలో అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ 

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఏఎస్‌గా 36 ఏళ్ల పాటు వివిధ శాఖల్లో పనిచేయడంతో పాటుగా ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేశ్వర్‌ తివారీ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ.. హరితహారం రూపకల్పనలో భాగస్వామ్యం కావడం తన సర్వీసులో అత్యంత సంతృప్తినిచ్చిన విషయమని చెప్పారు.

హరితహారం కార్యక్రమం ఐదేళ్లుగా విజయవంతంగా అమలు కావటం తన సర్వీస్‌ మొత్తంలో సంతోషాన్ని ఇచ్చిన విషయమని చెప్పారు. తివారీతో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా కర్నూలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన తివారీ, ప్రభుత్వంలో రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటి పారుదల, విద్యుత్‌ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, ఎఫ్‌.డీ.సీ ఎం.డి రఘువీర్, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు