గిరిజనుల భూముల్లో జేసీబీలతో తవ్వకాలు

20 Feb, 2016 15:19 IST|Sakshi

టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకుపల్లి మండలం కొప్పరాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం, బర్లగూడెం గ్రామాల్లో అటవీ అధికారులు శనివారం గిరిజనుల భూముల్లో తవ్వకాలకు ప్రయత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. సుమారు 125 ఎకరాల్లో గిరిజనులు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇవి అటవీ భూములు కావడంతో వాటిని స్వాధీనం చేసుకుని వనాలు పెంచాలని అధికారులు నిర్ణయించారు.

దీనిలో భాగంగా గత పది రోజులుగా జేసీబీలతో అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. సుమారు ఏడు గ్రామాల రైతులు శనివారం అక్కడకు చేరుకుని తమ బతుకుదెరువును లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో అటవీ సిబ్బంది పనులు ఆపివేశారు.
 

మరిన్ని వార్తలు