మరో వివాదంలో మాజీ ఏఎస్‌ఐ

4 Aug, 2018 01:29 IST|Sakshi
హోటల్‌ నుంచి బయటకు వస్తున్న మోహన్‌ రెడ్డి

కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మోహన్‌రెడ్డి సెటిల్‌మెంట్లు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్‌ పాఠశాల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న అక్రమ ఫైనాన్స్‌ నిర్వాహకుడు, మాజీ ఏఎస్‌ఐ బి.మోహన్‌రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సెటిల్‌మెంట్‌ చేసి.. ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయటపడ్డాయి. వీడియో దృశ్యాలను చిత్రీకరించిన మోహన్‌రెడ్డి బాధితు ల సంఘం, లోక్‌సత్తా ఈ వ్యవహారాన్ని మీడియాకు రిలీజ్‌ చేసింది.

సబ్‌కోర్టులో కేసు నం 416లో విచారణ నిమిత్తం వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో జిల్లా కోర్టు పక్కన గల ‘రెడ్డిగారి వంటిల్లు’లో భోజనానికి వెళ్లి సన్నిహితులతో ములాఖత్‌ కావడం వివాదా స్పదంగా మారింది. గతంలో కోర్టు ముందు గల ఉడిపి హోటల్‌లో సెటిల్‌మెంట్‌ నిర్వహించి డబ్బులు పంపిణీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో ఎస్కార్టు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

ఈ నెల ఒకటిన కరీంనగర్‌ కోర్టుకు వచ్చినప్పు డు సమీపంలోని భోజనశాలలో కూర్చొని సన్నిహితులతో ములాఖత్‌ నిర్వహించడం మరోమారు వివాదాస్ప దమైంది. మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితోపా టు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, సాయన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్‌ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్‌ ములాఖత్‌కు సహకరించిన ఎస్కార్ట్‌ పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు కూడా ఆదేశించామని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు