అప్పుల బాధతో రైతు ఆత‍్మహత‍్య

18 Nov, 2017 13:23 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత‍్తగూడెం: అప్పుల బాధతో రైతు ఆత‍్మహత‍్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన మద్దిశెట్టి వెంకటేశ్వరరావు(42) అనే రైతు శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల కోసం చేసిన అప్పులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు.

మరిన్ని వార్తలు