కలకలం

28 Jan, 2015 01:42 IST|Sakshi
కలకలం

మాజీ డిప్యూటీ సీఎంకు ఛాతినొప్పి
ఆస్పత్రిలో చేరిన రాజయ్య
జిల్లా వ్యాప్తంగా చర్చ
టీవీలకు అతుక్కుపోయిన జనం
టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన


వరంగల్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా మారిన ఉప ముఖ్యమంత్రి మార్పు పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో ఒత్తిడికి గురైన  రాజయ్య చాతినొప్పికి గురయ్యూరు. అధిక రక్తపోటుతో రాజయ్య హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. రాష్ట్రంలో  అకస్మాత్తుగా జరిగిన ఉప ముఖ్యమంత్రి మార్పు అంశంతోనే ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టి.రాజయ్య ఈ నెల 25న మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురయ్యారు. దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి ఈ పదవి వచ్చింది. తన బర్తరఫ్‌నే ఊహించని టి.రాజయ్య... ఉప ముఖ్యమంత్రి పదవిలో కొత్తగా చేపట్టిన నియామకం ఇబ్బందికరంగా మారింది. ఉప ముఖ్యమంత్రి మార్పు విషయంలో టి.రాజయ్య స్పందించి అదేరోజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయం విషయంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఇంటితో విషయం సద్దుమణిగిందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావించాయి. రెండు రోజులుగా టి.రాజయ్య దగ్గరికి పలువురు సన్నిహితులు వెళ్తున్నారు.

జరిగిన విషయంపై ఆరా తీస్తూ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టి.రాజయ్య ఒత్తిడికి గురయ్యారని.. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా, టి.రాజయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజయ్య భర్తరఫ్ కావడం, శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టడం వేగంగా జరిగారుు. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకుల్లో అయోమయం నెలకొంది. కొత్త నిర్ణయంపై కొద్దికొద్దిగా కుదురుకుంటున్న తరుణంలోనే రాజయ్య ఆస్పత్రిలో చేరడం గులాబీ పార్టీలో ఆందోళన పెరిగింది.
 
 

మరిన్ని వార్తలు