‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’

26 May, 2017 17:48 IST|Sakshi
‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తాము లక్ష కోట్లు ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఇవ్వలేదని అంటున్నారని, అసలు లెక్కలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.

ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న కేసీఆర్.. మరి అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అమర వీరుల పునాదులపై టీఆర్‌ఎస్‌ అధికారం చెలాయిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే నిరుద్యోగులను కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోరుతుంటే రైతులకు బేడీలు వేస్తున్నారని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు