విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు

10 Apr, 2017 12:55 IST|Sakshi

మెదక్ రూరల్: బోరు మోటార్ విద్యుత్తు సర్వీస్ వైరు తెగిపడి ఓ రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ మండలం శమ్నాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలివీ...గ్రామానికి చెందిన మైలి పోచయ్యకు గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉంది. కాగా, ఆ పొలానికి కరెంటు స్తంభాలు దూరంగా ఉండటంతో ఆమేర సర్వీస్ వైర్‌ను కర్రల మీదుగా లాగి మోటారును నడిపించుకుంటున్నాడు. కాగా, మంగళవారం ఉదయం కర్రపై ఉన్న తీగ కిందను సరి చేసేందుకు పోచయ్య ప్రయత్నించగా షాక్ తగిలింది. గాయపడిన పోచయ్యను తోటి రైతులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు