అనారోగ్యంతో మాజీ మంత్రి మృతి

10 Oct, 2019 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పురపాలక శాఖ మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి (96) అనారోగ్యంతో తన నివాసంలో గురువారం మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించిన నర్సింహారెడ్డి 1962లో మొట్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 1970 - 75 వరకు పరకాల సమితి అధ్యక్షుడిగా, 1981లో సమితి మెంబర్‌గా నియమితులయ్యారు. సమితి ఆధ్వర్యంలోనే జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా 1985 వరకు పనిచేశారు. 1985, 89లలో శాయంపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డిల కేబినెట్‌లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. నర్సింహారెడ్డికి ముగ్గురు సంతానం. కొడుకు, కోడలు అమెరికాలో ప్రముఖ వైద్యులు. పెద్ద కుమారుడు ఆయనతోనే హైదరాబాద్‌లో ఉన్నారు. కాగా, మాదాటి నర్సింహారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు.   

మరిన్ని వార్తలు