పల్లె కన్నీరుపెడుతుందో..

16 Jul, 2019 10:01 IST|Sakshi
మొగ్లి గ్రామంలో మొలకెత్తని పంట 

వర్షాలు లేక పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కాలం కలిసిరాక బీళ్లుగా మారిన భూములు చూసి రైతులు బావురు మంటున్నారు. పొట్టకూటీ కోసం కూలీగా మారుతున్నారు. పనులు లేక కుటుంబ పోషణ కోసం పట్టణాల బాట పడుతున్నారు. పనులు లేక ఏం చేయాలో తోచని రైతులు ఊళ్లో అష్టా చెమ్మా ఆడుతూ, హోటళ్లలో కబుర్లు చెప్పుకుంటూ, కూడ ళ్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. వరుణుడి కోసం రైతన్నలు ఆకా శం వైపు ఆశగా చూస్తున్నారు.

సాక్షి, తానూరు (ముథోల్‌) : ఖరీఫ్‌ ప్రారంభంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండడంతో రైతన్నల మొహంలో ఆనందం కనిపించింది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలున్నాయని వాతావరణశాఖ అధికారుల సూచనల మేరకు తమ పంటలకేమి డోకా లేదని ధీమాగా ఉన్నారు. జూన్‌ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో ఇక వర్షాలు కురియకుండా పోతాయా అని రైతులు తమ పంటపొలాల్లో విత్తనాలు వేసుకున్నారు. పక్షం రోజులు గడుస్తున్న మళ్లీ వర్షం కురియకపోవడంతో మొలకెత్తిన పత్తి, మినుము, సోయా మొలకలు పూర్తిగా ఎండిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. మరో వారం రోజుల తర్వాత వర్షం కురియడంతో రెండోసారి విత్తనాలు విత్తుకున్నారు. వారం రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో రెండవ సారి విత్తిన విత్తనాలు మొలకెత్తే దశలో వాడిపోతున్నాయి. తానూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్ట పరిహారం అందించి అదుకోవాలని వేడుకుంటున్నారు.

కరుణించని వరుణుడు..
జిల్లాలో జూన్‌ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో రైతన్నలు మురిసిపోయి పంటలను వేసుకున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తగా మరి కొన్ని మండలాల్లో వర్షాలు లేక ఎండిపోయాయి. తానూరు మండలంలోని మొగ్లి, మసల్గా, మసల్గా తండా, బెంబర, బోరిగాం, ఉమ్రి(కే), బెల్‌తరోడా, మహలింగి, బామ్ని, భోసి, బోల్సా, హిప్నెల్లి, ఎల్వి, ఎల్వత్, దాగాం, కళ్యాణి, కుప్టి, వడ్‌గాం, నంద్‌గాం, íసింగన్‌గాం, తానూరు, కోలూరు, జౌలా(బి), తొండాల గ్రామాల్లో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. పత్తి, సోయా, మినుము, పెసర పంటలు మొలకెత్తె దశలోనే వాడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు కురియకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం సమయంలో మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారుతోంది.

అప్పులు తీరేదెట్ల..
తానూరు మండలంలో ఈ ఏడాది 17,329 హెక్టార్లలో రైతులు పంటల్ని సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో 6,500 హెక్టర్లలో పత్తి, 7,800 హెక్టర్లలో సోయా, 1200 హెక్టర్లలో మినుము, 16 50 హెక్టర్లలో కంది, 120 హెక్టర్లలో పెసర, 34 హె క్టర్లలో వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌ పం టలు తీసే దశలో అధిక వర్షాలు కురియడంతో పంట దిగుబడి రాలేదు. రబీలో వేసిన పంటలపై దిగుబడి పొందుదామనుకుంటే అకాల వర్షం కారణంగా రైతులు అంతగా దిగుబడి పొందలేక పొ యారు. ఈ ఏడాదైన పంటల దిగుబడి పొంది చేసిన అప్పులు తీర్చుదామనుకున్న రైతన్నలకు ని రాశే మిగిల్చింది. రెండవ సారి విత్తనాలు వేయడంతో అప్పులు బాగా పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

మూడు రోజలు క్రితం మొగ్లి, మసల్గా, మసల్గా తండా, గ్రామాలకు ఏడీఏ అం జిప్రసాద్, వ్యవసాయ అధికారి గణేష్‌లు వెళ్లి వా డిపోతున్న పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమయం దా టిపోతుందని రైతులకు 50 శాతం సబ్సిడీపై వి త్తనాలు అందించి తానూరు మండలాలన్ని కరువు మండలంగా ప్రకటించి నష్టపరిహారం అందించా లని రైతులు ఏడీఏ అంజిప్రసాద్‌కు వినతి పత్రం అ టందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హమీ ఇచ్చారు.

కుటుంబ పోషణ కోసం పట్టణాలకు..
ఎండ కాలంలో గ్రామంలో జాతీయ ఉపాధి హా మీ పథకంలో కూలీలకు చేతినిండా పని కల్పిం చా రు. దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. జూ న్‌ మొదటి వారంలో ఉపాధి హామీ పనులను అ ధికారులు నిలిపివేయడంతో వర్షాలు లేక కూలీ ల కు పనిదొరకడం లేదు. దీంతో పనుల కోసం ప ట్ట ణాల బాట పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కు రిస్తే చేతి నిండా పని ఉండేదని వర్షాలు లేక కొంత మంది రైతులు, కూలీలు గ్రామాల్లోని చా వడి వ ద్ద, ఆలయాల్లో, హోటళ్లలో అష్టాచెమ్మా ఆ డు తూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. 

సబ్సిడీ విత్తనాలు అందేవిధంగా చూస్తాం
తానూరు మండలంలోని ఆయా గ్రామాల్లో సం దర్శించి రైతుల పంటలను పరిశీలించారు. వర్షాలు లేక పంటలు మొలకెత్తలేదు. సోయా, పత్తి విత్తనాలు వేసుకునే సమయం దాటి పో యింది. వర్షాలు కురియగానే రైతులకు సబ్సి డీపై కంది విత్తనాలు అందించేందుకు సిద్దంగా ఉంచాం. పంటలకు బీమా చేసుకోవాలని రైతులకు సూచించాం. బీమా చేసుకున్న రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తాం. 
– ఏడీఏ, అంజిప్రసాద్‌  

రెండు సార్లు విత్తనాలు వేశాం 
ఈ ఏడాది జూన్‌ రెండవ వారంలో కొంత మేరకు వర్షాలు కురియడంతో విత్తనాలు వేసుకున్నాం. వర్షం కురియకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. వారం రోజుల తర్వాత మరోసారి వర్షం కురిసింది. భూమిని దున్ని మరోసారి విత్తనాలు వేసుకున్నాం. విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేక మొలకలు వాడిపోతున్నాయి. రెండో సారి పంటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయాం. రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే మొలకలు బతుకుతాయి. లేదంటే నష్టమే మిగులుతుంది.
– నాగేశ్వర్‌ జకోటే, మొగ్లి రైతు 

నష్ట పరిహారం అందించాలి
మొగ్లి గ్రామంలో వర్షాలు కురియక రైతులు వేసుకున్న పంటలు మొలకెత్తలేదు. ఖరీఫ్‌లో పంటలు వేసుకునే సమయం దాటిపోయింది. పంటలు వేసుకున్నా దిగుబడులు రావడం కష్టంగా మారింది. దీంతో రైతులు విత్తనాల కోసం చేసిన అప్పులు తీరని పరిస్థితి ఉంది. అధికా రులు తానూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలి.
– దిగాంబర్, రైతు, మొగ్లి 

మరిన్ని వార్తలు