రైతులకు కేసీఆర్‌ మరో తీపికబురు

8 Jun, 2017 19:53 IST|Sakshi
రైతులకు కేసీఆర్‌ మరో తీపికబురు
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి రైతులకు తీపికబురు చెప్పారు. త్వరలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమాఖ్యలు ఏర్పాటుచేస్తామని అన్నారు. గురువారం పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500కోట్ల నిధిని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతు సమాఖ్యకు విశేష అధికారాలు ఉంటాయని అన్నారు. సరైన ధర రాకపోతే రైతు సంఘాలకే ప్రాసెసింగ్‌ హక్కు ఉంటుందని చెప్పారు. 
 
రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం 
గురువారం మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగింది. బ్రెవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దేవీ ప్రసాద్‌ను, స్టేట్‌ ఫుడ్‌ సొసైటీ చైర్మన్‌గా ఎలక్షన్‌ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
భద్రాద్రి విషయంపై తుమ్మలతో ఆనంద్‌సాయి భేటీ
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ ప్రణాళికను మంత్రి తుమ్మలకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి వివరించారు. దీంతో ఆలయ ప్రాకారం, మాఢ వీధుల్లో మార్పులు చేర్పులు, ఆగస్టు కల్లా ఆలయ అభివృద్ధిపై డీపీఆర్‌ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పారు.
మరిన్ని వార్తలు