పట్టాలివ్వలేదని ఓట్ల బహిష్కరణ

8 Dec, 2018 11:02 IST|Sakshi
పట్టాలు ఇవ్వడం లేదని ఓట్లను బహిష్కరించి ఆందోళన చేస్తున్న రైతులు   

4 గంటల పాటు రోడ్డుపై బైఠాయింపు 

తహసీల్దార్‌ హామీతో ఓటు వేసేందుకు కదిలిన గ్రామస్తులు 

సాక్షి, గార(ఇల్లందు): మండలంలోని వేదనాయకపురం గ్రామ రైతులు తమ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని, ఓటు వేయమని 4 గంటల పాటు రోడ్డు బైఠాయించి ఓటును బహిష్కరించారు. సమాచారం తెలసుసుకున్న తహసీల్దార్‌ కృష్ణ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకుని ఓట్లు వేయాలని కోరారు. దీంతో రైతులు మాట్లాడుతూ.. 100 సంవత్సరాల క్రితం బిషఫ్‌ హజారయ్య దగ్గర తమ ముత్తాతలు భూములు కొను గోలు చేసి సేద్యం చేసుకుంటున్నామని, పలుమార్లు రెవెన్యూ అధికారులకు భూములు పట్టాలు చేయాల ని విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఓట్ల బహిష్కరణకు సిద్ధమయ్యామని తెలిపారు.  పాస్‌పుస్తకాలు లేకపోవడంతో  రైతుబంధు డబ్బులు రాలేదని వాపోయారు. రైతుల భూములకు పట్టాలు ఇప్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కృషి చేస్తానని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో సుమారు 168 మంది ఓటర్లు ఓటు వేసేందుకు కదిలారు.

మరిన్ని వార్తలు