ఒకే కాన్పులో నలుగురు జననం..కానీ !

15 Aug, 2017 20:35 IST|Sakshi
ఒకే కాన్పులో నలుగురు జననం..కానీ !

ఎర్రుపాలెం: నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారని ఆ దంపతులు ఎంతో సంతోషించారు. అయితే ఆ సంతోషం కొన్ని గంటలకు వరకు మాత్రమే నిలిచింది. ఒకే కాన్పులో నలుగురు శిషువులకు జన్మనిచ్చిన మాతృమూర్తి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామానికి చెందిన గంతాల రామకృష్ణ భార్య భవాని(22) మంగళవారం తొలి సాధారణ కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. అయితే బలహీనంగా ఉన్న పసికందులు ముగ్గురు చనిపోగా ఒక బిడ్డే బతికింది.

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో భవానీని చేర్పించారు. మద్యాహ్నం ఆమెకు  ముగ్గురు ఆడ, ఒక మగ శిశువులు జన్మించారు. తొలుత పుట్టన వారందరూ క్షేమంగానే ఉన్నట్లు తెలిసి ఆనందించారు. అయితే కొద్దిసేపటికే శిశువులు సరిగ్గా శ్వాస తీసుకోవడం లేదని డాక్టర్‌ తెలిపారు. అక్కడి నుంచి విజయవాడలోని పిల్లల ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.

దీంతో వారు వెంటనే విజయవాడకు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  ఖర్చు భరించలేమని భావించిన ఆ నిరుపేద దంపతులు తిరిగి వరంగల్‌ ఎంజీఎంకు బయలుదేరారు. కంచికచర్ల సమీపంలో  ముగ్గురు ఆడ శిశువులు మృతి చెందారు. ప్రాణాలతో ఉన్న మగ శిశువు మళ్లీ తిరువూరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన భవానికి మామునూరు గ్రామానికి చెందిన రామకృష్ణలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

మరిన్ని వార్తలు