రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

1 Sep, 2018 01:15 IST|Sakshi
నాగేందర్, శివాజీ, తృప్తి, వరుణ్‌

     తూఫాన్‌ వాహనం లారీని ఢీకొనడంతో దుర్ఘటన  

     మరో ఏడుగురికి గాయాలు.. సంగారెడ్డి జిల్లాలో ఘటన  

సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి)/అబిడ్స్‌: డ్రైవర్‌ మద్యం మత్తు నలుగురి మృతికి కారణమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వద్ద ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన ఇంగ్లే రామారావు అనే టీచర్‌ కుటుంబం, వారి బంధువులు తూఫాన్‌ (కేఏ39 ఏం 1863), టవేరా వాహనాల్లో మొత్తం 19 మంది కలసి గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని రావూర్‌కు ఓ నిశ్చితార్థం వేడుకకు వెళ్లారు. శుభకార్యం ముగించుకొని తూఫాన్‌ వాహనంలో 12 మంది, టవేరాలో ఏడుగురు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో తూఫాన్‌ డ్రైవర్‌  ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి లారీని ఢీకొని కిందకు చొచ్చుకెళ్లింది.

ప్రమాదంలో వాహనంలోని  శివాజీ (28), వరుణ్‌ (9), నాగేందర్‌ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంధువులు సమాచారంతో çఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సదాశివపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తృప్తి (16) చికిత్స పొందుతూ మృతి చెందింది. క్షతగాత్రులైన సంగీత, విజయలక్ష్మి, అనిషా, ముకుల్, వైభవ్‌ , రమేశ్, లక్ష్మీబాయిలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.  డ్రైవర్‌ రవి ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు.  తిరుగు పయనంలో దాబా వద్ద భోజనాలకు ఆగిన సమయంలో డ్రైవర్లు ఇద్దరూ మద్యం తాగారని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మహిమ అనే మహిళ ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జమిలి ఎన్నికలకు మా మద్దతు ఉంటుంది : కేటీఆర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

టీఎస్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌ నియామకం

ఇంటర్‌ ఫలితాల పిటిషన్లపై ముగిసిన విచారణ

‘తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేస్కోండి’

ఆ విషయంలో కేసీఆర్‌ను సమర్థిస్తా: జగ్గారెడ్డి

ఇంటికి చేరుకున్న దాసరి ప్రభు!

హైకోర్టులో శివాజీ క్వాష్‌ పిటీషన్‌ దాఖలు

భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

వివాహ చట్టంతో సమన్యాయం

డిపో ఎప్పుడో?

‘కామాంధుడిని శిక్షించే వరకు.. దహనం చేయం’

‘పానీ’ పాట్లు

ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు

రెవెన్యూ ప్రక్షాళన!

కన్నూరులో కన్నాలెన్నో!

కుర్చీలాట

హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..

గుత్తాధిపత్యానికి చెక్‌

మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్‌’ క్లియర్‌

సంరక్షణే సవాల్‌!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు 

చదవడం.. రాయడం!

వసూళ్ల ఆగలే

ఇక సెన్సెస్‌–2021

సారూ.. చదువుకుంటా! 

విదేశాలకూ దైవ ప్రసాదం 

గుట్కాపై నిషేధమేది? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంటబ్బాయ్‌ ఇష్టం

బీచ్‌ బేబి

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా...

మాటల్లో చెప్పలేనిది!

ఆ నగ్న సత్యమేంటి?

ర్యాంకు రాకపోతే..!