వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

15 Jul, 2014 23:46 IST|Sakshi
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

వర్గల్/కంగ్టి/రామచంద్రాపురం/
 సిద్దిపేట రూరల్ : జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు  మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి..  వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గూడ్స్ వాహనం డ్రైవర్ దుర్మరణం చెందాడు.
 
 ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లికి చెందిన ఖలీల్ (31)  వాహనంలో కూరగాయలను ఇతర ప్రాంతాల కు తరలిస్తుంటాడు. సోమవారం చేవెళ్ల నుంచి కొత్తిమీర లోడ్‌తో కరీంనగర్ మార్కెట్‌కు వెళ్లా డు. అయితే తిరుగు ప్రయాణంలో మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వర్గ ల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ సమీపం లో అదుపు తప్పి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం ధ్వంసం కాగా అందులో ఉన్న డ్రైవర్ ఖలీల్ తీవ్రంగా గాయపడ్డాడు.
 
 వెంటనే అతడిని ములుగు 108లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత నిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందు తూ 10 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి భార్య మహెరూన్ బేగం, ఎనిమిదేళ్ల లోపు సానియా, సల్మాన్, సాదియా, సమీరా అనే నలుగురు పిల్లలున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులున్నారు.
 
 మరో ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం వాసర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన పలువురు ఆటోలో కంగ్టి మండలం కిషన్ నాయక్ తండాకు బయలుదేరారు. ఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కంగ్టి నుంచి  నారాయణఖేడ్‌కు వస్తోంది. అయితే మండల పరిధిలోని వాసర్ శివారులో గల వంగ్దాల్ వంతెన సమీపంలో ఉన్న మూల మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సంజీవ్‌రావు (75) తలకు బలంగా దెబ్బ తగలడంతో ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదంలో గాయపడ్డ వారిని 108లో ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 కాగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో సంజీవరావు మార్గమధ్యలోనే మృతి చెందాడు. బిడికన్నె సాగర్ , ప్రశాంతమ్మలకు తల, కన్నుపై బలంగా గాయాలయ్యాయి. కాగా ఆటో డ్రైవర్ జ్ఞానేశ్వర్ కు స్వల్ప గాయాలు కాగా అతను సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ హజీమియాను అదుపులోకి తీసుకున్నారు. ఖేడ్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఎం భూపాల్‌రెడ్డి, బంజారా సేవాలాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌నాయక్ లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
 
 డీసీఎం వాహనం ఢీకొని...
 రామచంద్రాపురం : డీసీఎం వాహనం ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందిన సంఘటన పట్టణంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. నిజాంసాగర్‌కు చెందిన అం జా గౌడ్ (50) జీవనోపాధి నిమిత్తం రామచంద్రాపురానికి వలస వచ్చాడు.
 
 ఇక్కడి పారిశ్రామికవాడలో గల ఓ పరిశ్రమలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవా రం ఉదయం సంగీత థియేటర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా సంగారెడ్డి నుంచి లింగంపల్లి వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అంజా గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
 
 గుర్తు తెలియని వాహనం ఢీకొని...
 సిద్దిపేట రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రంగధాంపల్లి శివారులో సోమవా రం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ కథనం మేరకు.. నంగునూరు మండలం వెల్కటూరుకు చెందిన ఎండీ మౌలా న (50) సోమవారం ఉదయం పని నిమిత్తం సిద్దిపేటకు వచ్చాడు.
 
 రాత్రి కావడంతో సిద్దిపేట నుంచి వెల్కటూరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో రంగధాంపల్లి శివారులోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి అయినా మౌలాన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ సిద్దిపేట వైపునకు వచ్చా రు. అదే మార్గంలో మౌలానా మృతదేహం కనపడడంతో బోరున విలపించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు