రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు?

1 Aug, 2014 02:49 IST|Sakshi

వరంగల్, ఖమ్మం, గోదావరిఖని, మంచిర్యాలలో ఏర్పాటు
సీఎం అనుమతి రాగానే అమల్లోకి

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు  కానున్నాయి. వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, గోదావరిఖనిలలో వీటి ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. జనాభా పెరగడంతో, శాంతిభద్రతలను, నేరాలను నియంత్రణ చేయడం భవిష్యత్తు లో కష్టమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. వరంగల్‌లో పోలీసుకమిషనరేట్‌ను  ఏర్పాటు చేయాలనేది  ఉమ్మడిరాష్ట్రంలోనే ప్రతిపాదించారు. విభజన అనంతరం మిగిలిన ప్రాంతాల్లో  కమిషనరేట్లు తప్పనిసరి అనే భావన  సీఎం కేసీఆర్‌కు ఉందని పోలీసువర్గాలు తెలిపాయి. దీంతో విధివిధానాలు, మౌలిసదుపాయాలు,  పోలీసుఅధికారులు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలతో కమిషనరేట్ల ప్రతిపాదనలను  డీజీపీ  అనురాగ్‌శర్మ  సిద్ధం చేశారని తెలిసింది. కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈమేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు