7 దేశాల్లో రాష్ట్ర మహిళల బైక్‌ యాత్ర 

11 Feb, 2018 02:19 IST|Sakshi
నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర ,మంత్రి అజ్మీరా చందూలాల్‌

  రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం: మంత్రి చందూలాల్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 50 రోజుల యాత్రలో భాగంగా భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారని తెలిపారు.

ఈ యాత్రలో వీరు 19 యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శిస్తారని అన్నారు. ఈ యాత్రకు జై భారతి నాయకత్వం వహిస్తారని, ఈమెతో పాటు ప్రియ, శాంతి, శిల్ప నలుగురు సభ్యుల బృందంలో ఉంటారని తెలిపారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్‌ ఆటో కంపెనీ వారు స్పాన్సర్‌ చేశారని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు