ఈ-పీహెచ్‌సీల్లో ఫ్రీ టెస్టులు: హెల్త్‌ మినిస్టర్‌ లక్ష్మారెడ్డి

8 Jan, 2017 16:37 IST|Sakshi
ఈ-పీహెచ్‌సీల్లో ఫ్రీ టెస్టులు: హెల్త్‌ మినిస్టర్‌ లక్ష్మారెడ్డి

షాద్‌నగర్‌: నూతనంగా ఏర్పాటుచేస్తోన్న ఎలక్ట్రానిక్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌(ఈ-పీహెచ్‌సీ)లో ఔట్‌ పేషెంట్‌ సేవలేకాక ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ-పీహెచ్‌సీని రవాణా శాఖ మంత్రి మహేదర్‌రెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, ఈ -వైద్య సంస్థ సంయుక్తంగా ప్రయోగాత్మకంగా ఈ-పీహెచ్‌సీలను ఏర్పటుచేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ- హెల్త్‌ సెంటర్‌కు వచ్చే ప్రతి రోగి వివరాలను కంప్యూటరైజ్‌ చేస్తారని, దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడం సులభతరమవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్యం అందిస్తారని తద్వారా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు