ఎస్సీ, ఎస్టీ రైతులకు ట్రాక్టర్లు ఉచితం

10 May, 2016 07:59 IST|Sakshi

సీఎం వద్దకు ఫైలు... ఆమోదం తర్వాత జీవో విడుదల

హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా వ్యవసాయ ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్ల సబ్సిడీని మరింత పెంచింది. ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లను ఇస్తుండగా... ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 95% వ్యవసాయశాఖ ద్వారా, మిగిలిన 5% ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ సొమ్ము అందజేయాలని నిర్ణయించింది.
 
ఇప్పటికే గ్రీన్‌హౌస్ సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% చేయగా... దాంతోపాటు ట్రాక్టర్లకూ అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. సీఎం ఆమోదించాక రెండింటికీ కలిపి త్వరలో జీవోలు విడుదల కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీని వ్యక్తిగతంగా ఇవ్వడంతోపాటు  ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చుకునేట్లయితే దానికీ 100% సబ్సిడీ ఇస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలతోపాటు వీటినీ సరఫరా చేస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలకు మాత్రం అందరికీ ఉన్న సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకూ కొనసాగుతుంది.
 

మరిన్ని వార్తలు