‘యువతకు రైల్వే పోస్టుల ఉచిత శిక్షణ ఇవ్వాలి’

4 Feb, 2019 01:44 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు ఎంపీ వినోద్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: భారతీ య రైల్వేలో వివిధ పోస్టుల కోసం త్వరలో రాత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఎంపీ వినోద్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశా రు. దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో త్వరలో రెండున్నర లక్షల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలి సిందే. త్వరలోనే రైల్వేలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది పదవీ విరమణ చేయనున్నారు.

దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. బిహార్, తమిళనాడుల్లో ఉచిత కోచింగ్‌ ఇస్తుండటంతో అక్కడి నిరుద్యోగులకు ఎక్కువగా రైల్వే లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర యువతకు వంద రోజుల పాటు ఉచి తంగా కోచింగ్‌ ఇవ్వాలని సీఎంతో పాటు గురుకుల పాఠశాలల సమితి కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఎంపీ వినోద్‌ లేఖలు రాశారు. హైదరాబాద్, కాజీపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లతో పాటు అన్ని పాత జిల్లా కేంద్రాల్లో రైల్వే పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేం దుకు ఏర్పాట్లు చేయాలని వినోద్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు