నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

15 Mar, 2018 08:13 IST|Sakshi
కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(మధ్యలో)

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ 

కరీంనగర్‌ సిటీ: ఇండియన్‌ ఆర్మీలో ఉపాధి కోసం మేలో వరంగల్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో కరీంనగర్‌ జిల్లా నుంచి ఎక్కువమంది ఎంపికయ్యేందుకు నిరుద్యోగ యువతకు వారధి, ఎన్‌సీసీ బెటాలియన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు.

రన్నింగ్‌ అంబేద్కర్‌ స్టేడియంలో, క్యూటీ ఎస్సారార్‌ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి కళాశాలలో ర్యాలీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 8వతరగతి నుంచి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, ఎల్‌ఎల్‌బీ ఇంజినీరింగ్‌ విద్యాభ్యాసం చేసినవారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరొచ్చని అన్నారు. వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఉమాశంకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు