శారదాపీఠంలో ఉచిత వేద విద్య

14 Mar, 2018 02:41 IST|Sakshi

పెందుర్తి: దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థికభారంతో, పోషణకు ఇబ్బందులు పడుతున్న వేద పాఠశాలల్లోని విద్యార్థులు, గురువులను విశాఖ శ్రీ శారదాపీఠం దత్తత తీసుకోనున్నట్లు ఉత్తర పీఠాధిపతి బాలస్వామి తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిజీ ఆశీస్సులతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారిని చినముషిడివాడలోని పీఠానికి తరలించి ఇక్కడి వేద పాఠశాలలో శిక్షణతో పాటు వసతి కల్పిస్తామన్నారు. వీరికి వేద విద్య (రుగ్వేదం, యజుర్వేదం)తో పాటు స్మార్థము, ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, సంస్కృత పరిజ్ఞానం అందించాలని సంకల్పించామన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శారదాపీఠం తరపున ఉత్తీర్ణత ధ్రువపత్రం, రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. శారదాపీఠంలో పదేళ్ల క్రితం జగద్గురువులు శంకరాచార్య వేద పాఠశాలను స్థాపించి ఎందరికో విద్యాబుద్ధులు చెప్పారన్నారు. వేద పాఠశాలలో చేరే ఆసక్తి గలవారు విశాఖ శ్రీశారదాపీఠం, చినముషిడివాడ, విశాఖపట్నం–530051 అడ్రస్‌కు, లేదా 94403 93333, 93485 55595, 99666 69658 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు