ఇక నగరంలో ఉచిత వైఫై

16 Apr, 2015 23:37 IST|Sakshi

హైదరాబాద్: రెండు మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాతావారణం చల్లబడింది. దీంతో అహ్లాదంగా గడపుదామనుకున్న వారితో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. దీనికి తోడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి జనాలు కిటికిటలాడటానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వివారాల్లోకె ళ్లాల్సిందే.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపోందించే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైఫై సేవలను అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

దీనిలో భాగంగా ప్రముఖ మొబైల్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి అరగంట ఫ్రీ వైఫై కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా ఉన్న మన నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇచ్చిన అరగంట వైఫై ఫ్రీ ఆఫర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకోవడంతో రహదారులన్ని జనసంద్రాలుగా మారాయి. యువతతో పాటు నగర వాసుల్లో అధిక శాతం మంది ఇక్కడే ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు