ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్‌ 

27 Mar, 2020 00:59 IST|Sakshi

మసీదుల్లో సామూహిక ప్రార్థనలు వద్దు

వక్ఫ్‌ బోర్డు సీఈఓ ఉత్తర్వులు

జామియా నిజామియా వర్సిటీ ఫత్వా 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఇస్లామిక్‌ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్‌ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు.

మరిన్ని వార్తలు