మర్యాద..మర్యాద!

9 Apr, 2018 09:38 IST|Sakshi
సంగారెడ్డి పీఎస్‌లోని రిసెప్షన్‌లో ఫిర్యాదు నమోదు చేసుకుంటున్న సిబ్బంది

ప్రజలతో మమేకమవుతున్న

‘ఫ్రెండ్లీ పోలీస్‌’ భయం లేకుండా స్టేషన్‌కు వస్తున్న బాధితులు

అమలులో ముందంజలో ఉన్న సంగారెడ్డి జిల్లా..

వీపీఓతో పల్లెల్లోకి పోలీస్‌

సంగారెడ్డి క్రైం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్‌ శాఖ పనితీరులో అనేక మార్పులు వచ్చాయి. గతంలో ప్రజలు పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం ఆ పరిస్థితిని మార్చిం ది. ఈ విధానం ద్వారా పోలీస్‌లు స్టేషన్‌కు వచ్చే ప్రజలు, బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటారు. ఫిర్యాదులను స్వీకరిస్తారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో రిసెప్షనిస్టుగా మహిళా పోలీసులను నియమించడానికి పోలీస్‌ శాఖ సన్నాహాల చేస్తోంది. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ప్రజలతో పోలీసులు మమేకమవుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకించి ప్రభుత్వం ఓ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసింది.

ప్రజలతో మమేకం కావడానికి వీపీఓ..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పోలీసులపై నమ్మకం పెరగడాని కి, వారితో మమే కం కావడానికి గ్రా మ పోలీస్‌ అధికారుల నియామకాన్ని చేపట్టారు. ఈ విధానం సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి దోహదపడుతోంది. గ్రామంలో శాంతిభద్రతల విషయంలో గ్రామ పోలీస్‌ అధికారి పాత్ర కీలMý.ంగా మారింది. మారుమూల పల్లెలో సైతం ఎలాంటి సమస్య జరిగి నా కొద్ది సమయంలోనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది.

సమాజసేవలో సిద్దిపేట పోలీసులు..
సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలోని పో లీసులు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్,   సిద్దిపేట, హుస్నాబాద్‌ ప్రాంతంలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. మూఢనమ్మకాల నిర్మూలనకు కళాబృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. యువతలో ఉత్సహాన్ని కలిగించడానికి 2కే రన్, 3కే రన్, 5కే రన్‌లతో పాటు సైకిల్‌రేసులు, క్రికెట్‌ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. 12 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం ఎరగని వర్గల్‌ మండలంలోని గుట్టుపల్లికి పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బస్సు సౌకర్యం కల్పించారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.

ముందంజలో సంగారెడ్డి పోలీసులు...
నిజామాబాద్‌ జోన్‌ పరిధిలోని కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లా పోలీసులు స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే తీరు అందికంటే మెరుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా సంప్రదించి నివేదికను అందించే ఓ సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడి అయినట్లు అధికారులు తెలిపారు.

పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా వెళ్తున్నాం...  
గతంలో పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లంటేనే భయంగా ఉండేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైన పెద్ద మనుషులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం ద్వారా ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే నేరుగా స్టేషన్‌కు వెళ్లి చెప్పుకుంటున్నాం. పోలీస్‌ అధికారులు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు.– సిద్దిరామాగౌడ్, మాసాయిపేట

పక్కాగా ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం..
పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుడితో పోలీసులు ఫ్రెండ్లీగా ప్రవర్తించాలని ఆదేశిం చాం. హైదరాబాద్‌ తరహాలోనే ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం అమలు చేస్తున్నాం. శిక్షణ పొందిన పోలీసులను రిసెప్షనిస్టులుగా నియమిస్తున్నాం. నేరాల నియంత్రణకు బ్లూ కోర్టులను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం.     –జోయల్‌ డేవిస్, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

>
మరిన్ని వార్తలు