నేటి నుంచి కేయూ పీజీ సెట్

24 May, 2014 02:38 IST|Sakshi

కేయూ క్యాంపస్(వరంగల్), న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్ శనివారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుందని కేయూ ఇన్‌చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహచారి తెలిపారు. పీజీ సెట్‌లో భాగంగా 37 కోర్సులకు 32,321 దరఖాస్తులు వచ్చాయని, ఈ మేరకు కోర్సుల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. కేయూ పీజీ సెట్ రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్లను పోస్టు ద్వారా పంపించామని, అందని వారు ఆన్‌లైన్‌లో డౌన్‌లోన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పీజీ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

 పీజీ సెట్ షెడ్యూల్ ఇదే..
 కోర్సుల వారీగా పీజీ సెట్ నిర్వహించే తేదీల వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24న ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు ఎమ్మెస్సీ బాటనీ, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 25వ తేదీన ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్, ఫిజిక్స్(ఇంట్రుమేషన్), ఎంఏ సోషియాలజీ, పీజీ డిప్లోమా ఇన్ సెరికల్చర్, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఉదయం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షలు జరుగుతాయి.

28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లెడ్ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్‌ఆర్‌ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అలాగే, జూన్ 1వతేదీన ఉదయం ఎంకాం, ఎంకాం(ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎంకాం బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మధ్యాహ్నం ఎంఏ తెలుగు, ఎంఏ జెండర్ స్టడీస్, ఎమ్మెస్సీ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు జరుగతాయి.

మరిన్ని వార్తలు