అందుకో.. ఆసరా!

10 Dec, 2014 03:57 IST|Sakshi
అందుకో.. ఆసరా!

నేటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం
జిల్లాలో 3.54లక్షల మందికి లబ్ధి
అర్హులందరికీ కార్డుల అందజేత
అన్నివర్గాలతో పాటు కళాకారులకూ పింఛన్లు
పంపిణీకి పోలీసు బందోబస్తు.

 
మహబూబ్‌నగర్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ(ఆసరా)కి రంగం సిద్ధమైంది. అనేక అవాం తరాల నేపథ్యంలో అర్హులజాబితా ఓ కొలిక్కి వచ్చిం ది. జిల్లాలో మొత్తం 3.54లక్షల మందికి పింఛన్లు అందించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. గతనెల 8న సీఎం కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో లాం ఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తిస్థాయిలో పం పిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి నెలరోజుల సమయం పట్టింది. పలుమార్లు వాయిదా పడుతూ.. బుధవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సంకల్పించారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీచేయాలని జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ.70కోట్లు మంజూరయ్యాయి.
 
పంపిణీకి పోలీసుల బందోబస్తు
 
పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పింఛన్ల మొత్తం భారీగా పెరగడంతో పాటు పంపిణీ కూడా రెండు నెలలకు కలిపి ఒకేసారి అందజేస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల నుంచి చోరీకి గురికాకుండా ఉండేం దుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయవైరుధ్యాలున్న గద్వాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల ఆర్డీఓను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
 
 ప్రహసనంగా సాగిన ప్రక్రియ..

 
 పింఛన్ల పంపిణీ పథకానికి ఆదినుంచీ అడ్డుంకులు ఎదురయ్యాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీమేరకు వికలాంగులకు రూ.1,500, వృద్ధు లు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు రూ.1,000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ అర్హులకే అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొదట నిర్ధేశించిన విధంగా దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సమగ్ర సర్వేలో పొంతన కుదరకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసి అందుకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించారు.
 

>
మరిన్ని వార్తలు