సుమార్గ్‌ శిక్షణతో అద్భుత ఫలితాలు

1 Oct, 2019 10:40 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీ రవీందర్‌

పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌

సాక్షి, కేయూ క్యాంపస్‌: పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో యువత ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన సుమార్గ్‌ ఉచిత శిక్షణలో అద్భుత ఫలితాలు సాధించామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు. సుమార్గ్‌ ఉచిత శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చిన యువతకు సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సేనెట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీ ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. సుమార్గ్‌ రెండోవిడత ఉచిత శిక్షణ తరగతులకు 300ల మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఇందులో ప్రధానంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు 40మంది, కానిస్టేబుళ్లుగా 165మంది, మరో 49మం ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శిక్షణ అందించిన అభ్యర్థుల్లో 80శాతం మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. మీరు ప్రతిభతో సాధించిన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా కృషిచేయాలని ఆయన కోరారు. సుమార్గ్‌ శిక్షణ అందించటంలో పూర్తి సహకారం అందించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతకు పోలీస్‌ కమిషనర్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేగాకుండా శిక్షణ ఇచ్చిన పోలీస్‌ అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు డీసీపీ గిరిరాజు, ఎసీపీలు శ్రీధర్, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఆర్‌ఐ సతీష్, హతీరాం, శ్రీనివాస్‌రావు, నగేష్, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, కేయూ పోలీస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా