ఇంధనం.. భారం  

10 Nov, 2018 09:55 IST|Sakshi

 పెరుగుతున్న పెట్రోల్,  డీజిల్‌ధరలు 

  బెంబేలెత్తుతున్న వాహనదారులు 

   ఆకాశంలో నిత్యావసరాల ధరలు  

సాక్షి, తాడూరు: పెట్రోల్, డిజిల్‌ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులను కలవర పెడుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో అవి ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాహనాలను కొంటున్న వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. డీజిల్‌ ధర పెట్రోల్‌తో సమానంగా పరుగులు తీస్తుంది. డీజిల్‌ వాహనాలతో జీవనం సాగించే వారికి ప్రస్తుతం ధరలు మరింత భారంగా మారాయి.  


భారంగా పెరిగింది 
ప్రభుత్వం ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అయిల్‌ కంపెనీలు డిజిల్, పెట్రోల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో అంతటా విమర్శలు వెల్లువెతుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు మారుతుండటంతో ఈ ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతుంది. దీంతో సామాన్య ప్రజలపై భారం భాగా పెరిగింది.  


డీజిల్‌కే ఖర్చు
ఆటో వంటి చిన్న వాహనాలు నడుపుకుంటూ జీవనం సాగే వారి పరిస్థితి భారంగా మారింది. దీంతో ఆయా వాహనదారులు ఈ ఆందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం వారి కుటుంబ పోషణపై పడుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. డిజిల్‌ధర రూ.80లకు పైగా చేరడంతో వచ్చిన సంపాదన డిజిల్‌కే సరిపోతుందని వారు అంటున్నారు. ఫైనాన్స్‌లో తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టలేకపోతున్నామని అన్నారు.

 
యువతపైనే భారం 
పెట్రోల్‌ దరలు పెరుగుతుండటంతో యువతకు భారం అధికమవుతుంది. పెరిగిన ధరలతో యు వత ద్విచక్ర వాహనాలు నడిపేందుకు సంకోచిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు పరుగెడుతు న్న యువత కళాశాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. అది పెట్రోల్‌ తాగే పల్సర్, సీపీజెడ్, బుల్లెట్, యూనిఖాన్‌ వంటి వాహనాలకు యువత ఆకర్షితులై వాటిని కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు వారికి కంటిపై కునుకు లేకుండా çచేస్తున్నాయి. పలువురు వాహనదారులు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. 


నియంత్రణ ఉండాలి 
ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే ఇంధనం ధరలు అదుపులో ఉంటాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు. ఆటోలు ఫ్యాసింజర్లను దూర ప్రాంతాలకు తీసుకెళ్లే కారు డ్రైవర్లు తాము సంపాదించిన మొత్తం డిజిల్, పెట్రోల్‌ కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై çకేంద్ర ప్రభుత్వం స్పందించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని పలు గ్రామాల వాహనదారులు కోరుతున్నారు. 


ఇబ్బందులు పడుతున్నాం 
పెట్రోల్‌తో పాటు సమానంగా డిజిల్‌ ధరలు పెరగడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిల్‌తో పనులు నడవడం ట్రాక్టర్లతో సాగు పనులు పెరగడం వల్ల డీజిల్‌ పెరిగే కొద్ది ట్రాక్టర్ల యజమానులు విపరీతంగా వ్యవసాయ పనులకు ధరలు పెంచుతున్నారు. రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డిజిల్‌ ధరలను అదుపు చేయాలి.  
            – లక్ష్మయ్య, మేడిపూర్‌ 
 
ప్రయాణం కష్టంగా ఉంది 
పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. రోజుకు రూ.100ల పెట్రోల్‌ పోయిస్తున్నాం. సరిపోవడం లేదు. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను అదుపులోకి తీసుకురావాలి.  
– సుధాకర్, తాడూరు 

   

మరిన్ని వార్తలు