తరలించే సచివాలయానికి మెరుగులు..!

3 Feb, 2015 02:50 IST|Sakshi

హైదరాబాద్: ‘ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తు బాగోలేదు.. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ తరలించి.,, ఆ స్థలంలో కొత్త సచివాలయాలన్ని  నిర్మిస్తాం’  అంటూ ఒకవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తుంటే... అధికారులు మాత్రం సచివాలయానికి మెరుగుల కోసమంటూ నిధులు విడుదల చేస్తున్నారు. సెక్రటేరియట్‌లో ప్రధాన రోడ్డు విస్తరణ కోసం రూ.9.80 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సెక్రటేరియట్‌లో మెయిన్ గేట్ నుంచి సీఎం కార్యాలయానికి వెళ్లే  ప్రధాన దారి మలుపులు తిరిగి ఉంది. అందుకే సీ బ్లాక్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదురుగా ఉన్న నల్ల పోచమ్మ దేవాలయానికి.. డి బ్లాక్‌కు మధ్యలో ఉన్న లాన్‌ను పూర్తిగా తొల గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణ సచివాలయ మార్గంలో మెయిన్‌గేట్, ఆర్చి నిర్మాణానికి కోటి రూపాయలు మం జూరు కాగా పనులు జరుగుతున్నాయి.  తెలంగాణ సంసృ్కతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఆర్చీ నిర్మిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్ గేట్‌కు సమీపంలో రోడ్డుకు అడ్డుగా ఉందనే కారణంతో  కిండర్ గార్టెన్ స్కూల్‌ను ఏ- బ్లాక్ సమీపంలోనికి తరలించారు. దీనికి  రూ.15 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. సచివాలయ తరలింపు నేపథ్యంలో ఇవన్నీ వృథా మిగిలిపోనున్నాయి.
 

మరిన్ని వార్తలు