ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం

13 Jul, 2020 02:54 IST|Sakshi
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులతో  మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి..

ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకు కేంద్రం రూ. 215 కోట్లు ఇచ్చింది

కేంద్రం ఇచ్చిన 888 వెంటిలేటర్లలో 10 శాతం కూడా వినియోగించట్లేదు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, అడ్డగోలు బిల్లులు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇం దుకోసం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీ టింగ్‌ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలన్నారు. గాంధీ, ఫీవర్, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు.

గాంధీలో 200 వెంటిలేటర్లు ఉన్నా అందులో చేరేందుకు ప్రజలు ఎందుకు భయ పడుతున్నారో, ఎందుకు వెనుకడుగు వే స్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తాను గాంధీ ఆసుపత్రిని సందర్శించానని, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. అక్కడ పని చేసే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 50 లక్షల బీమా కవరేజి తప్పితే ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కరోనా ఆసుపత్రుల్లో ఖర్చుల కోసమే కేంద్ర ప్రభుత్వం రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి 1,220 వెంటిలేటర్లకు గాను 888 కేంద్రం పంపించిందన్నారు. అందులో 10 శాతం కూడా వినియోగించడం లేదన్నారు. రాష్ట్రానికి 7,44,000 మాస్క్‌లు, 2,41,000 పీపీఈ కిట్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబెట్లు పంపించిందన్నారు. ర్యాపిడ్‌ టెస్టుల కోసం 1,23,000 యాంటిజెన్‌ కిట్లను, 1,02,407 ఆర్టీపీసీఆర్, 52 వేల వీటీఏ కిట్లు పంపించిందన్నారు. టెస్టులు సరిగా చేయడం లేదని, వాటిని చేయాలని కేంద్ర బృందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాయన్నారు.

వసతులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తో తాను మాట్లాడుతున్నానని, తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉన్నందునే టిమ్స్‌ను ప్రారంభించలేదని చెప్పారన్నారు. తన చొరవతోనే రైల్వే ఆసుపత్రిని, సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో రెండు బ్లాకులను కోవిడ్‌ ఆసుపత్రులుగా మార్చారన్నారు.  కేంద్రం ఇచ్చిన బియ్యం, పప్పు దినుసులు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ఇందుకోసమే రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. బియ్య పథకం కింద ప్రతి కిలోకు రూ. 31 కేంద్రం ఇస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలిచ్చేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో వాటి అమలును బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించానన్నారు.వరవరరావు విషయంలో చట్టప్రకారం ఏం చేయాలో ప్రభుత్వం అలాగే చేస్తుందన్నారు.

గాంధీ ఆస్పత్రి సందర్శన 
గాంధీ ఆస్పత్రి: కరోనా సోకిన ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని ఆయన ఆదివారం సందర్శించారు. డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ సూపరిం టెండెంట్‌ రాజారావు.. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలను ఆయనకు వివరించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా