రాజకీయాల్లో వెంకటస్వామి కుటుంబం 

19 Nov, 2018 15:24 IST|Sakshi

మంచిర్యాలటౌన్‌: 
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన గడ్డం వెంకటస్వామి(కాకా) 1973లో యూనియన్‌ డ్యూటి మినిస్టర్, లేబర్‌ అండ్‌ రిహాబిలేషన్‌ మంత్రిగా, 19977 వరకు సప్లై అండ్రిహాబిలేషన్‌ మంత్రిగా పనిచేశారు. 1977లో లోక్‌సభకు ఎన్నికై 1978–82లలో కేబినేట్‌ మినిస్టర్, లేబర్‌ అండ్‌ సివిల్‌సప్‌లై మంత్రిగా పనిచేశారు. 1989–91, 1991–96, 1996–98, 2004–2009లలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొంది 2009లో తన కుమారుడు వివేక్‌కు ఆ స్థానంను అప్పగించగా, ఆయన కూడా గెలుపొందారు. 

మంత్రిగా పనిచేసిన వినోద్‌ 
వెంకటస్వామి 1957లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాకా పెద్ద కుమారుడు గడ్డం వినోద్‌ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 

ఎంపిగా వివేక్‌ మార్కు 
2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీలో గడ్డం వివేక్‌ కీలకంగా వ్యవహరించారు. 2013లో ఎంపీగా ఉంటూనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.  

మరిన్ని వార్తలు