అజాత శత్రువుకు అశ్రునివాళి

17 Mar, 2014 00:21 IST|Sakshi
అజాత శత్రువుకు అశ్రునివాళి

 అంత్యక్రియల్లో పాల్గొన్న అభిమానులు
 
 మంచిర్యాల అర్బన్ న్యూస్‌లైన్ : పార్లమెంట్ మాజీ సభ్యుడు గడ్డం సర్సింహరెడ్డికి అభిమానులు, రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, అధికారులు, పుర ప్రముఖులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నర్సింహరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి  చెం దిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని స్వగృహంకు తీసుకొచ్చారు.
 
 మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీఎస్పీ రమణకుమార్, సీఐ సురేశ్, మంచిర్యాల, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కమలాకర్‌రావు, కొత్త సత్తయ్య, మాజీ చైర్మన్‌లు పెంట రాజయ్య, బుచ్చన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగల దయానంద్,  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరవింద్, మాజీ కౌన్సిలర్‌లు మినాజ్, రైసాభాను, సువ్వాబాయి, మమతా సూపర్ బజార్ చైర్మన్ యాదగిరిరావు, బీజేపీ నాయకుడు కెవీ ప్రతాప్, టీఆర్‌ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, పొన్నం మురళీధర్, మంచాల రఘువీర్, మాదం శెట్టిసత్యనారాయణ, గోగుల రవిందర్‌రెడ్డి,  శ్యాంరావు, వెంకటేశ్వర్‌రావు, ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం నాయకుడు బాలాజీ, బంధువులు నర్సింహరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన తన యులు ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, గంగారెడ్డి, అచ్యుతమ్‌త్‌రెడ్డిలకు సంతాపం ప్రకటించారు. ఓదార్పు నిచ్చారు. అనంతరం  అంతిమ యాత్ర నిర్వహించారు.
 
  స్థానిక గోదావరి తీరాన హిందు సాంప్రదాయం ప్రకారం వేద పండితులు శాస్త్రో్తంగా  అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు