అది నిజమే: గద్దర్‌ కీలక ప్రకటన

4 Dec, 2019 16:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని ప్రజాగాయకుడు గద్దర్‌ తెలిపారు. పాటకు, కళకు, అక్షరానికి వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను కోరుకున్నది కళాకారుని ఉద్యోగమేనని, ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించేందుకు అవకాశం వస్తుందని భావించి దరఖాస్తు పెట్టుకున్నానని తెలిపారు. దయచేసి అందరూ తన కోసం కోట్లాడి ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

73 ఏళ్ళ వయసులో తాను ఆడి, పాడకపోయినా ఫరవాలేదని, ఇప్పుడున్న కళాకారులు పాడుతుంటే వాళ్ళ వద్ద డప్పులు మోస్తానని తెలిపారు. రసమయి బాలకిషన్ తనను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది మిత్రులతో నా గురించి ఆయన చర్చించారని తెలిపారు. ప్రస్తుతం నిశ్శబ్దమే ఒక ప్రొటెస్ట్ రూపంగా కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉద్యోగం గురించి చేసిన దరఖాస్తుపై చర్చ జరిగితే అది సంతోషమేనని అన్నారు.

మరిన్ని వార్తలు