‘కాంగ్రెస్‌ను తరిమికొట్టడం టీఆర్‌ఎస్‌ తరం కాదు’

8 Nov, 2017 12:16 IST|Sakshi

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌ అర్బన్‌): కాంగ్రె స్‌ పార్టీని తరిమికొట్టడం టీఆర్‌ఎస్‌ వల్ల కాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ అన్నా రు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా, కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లేలా మాట్లాడడంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను తరిమికొట్టాలన్న టీఆర్‌ఎస్‌ నాయకు ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేసిన హౌసింగ్‌ కార్పొరేషన్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, డబుల్‌ బెడ్‌రూం నిర్మించి ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. సింగూర్‌ నీళ్లు ఇతర జిల్లాలకు తరలిస్తే ఊరుకోమని, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు కేశవేణు, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర్‌నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు బలరాం, నర్సింగ్‌రావు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చరణ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు విపుల్, ఓబీసీ నగర అధ్యక్షుడు నాగరాజు, ఎస్టీసెల్‌ నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్, సుమీర్‌ హైమద్, అక్బర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు