మద్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? : ఎమ్మెల్యే

13 Dec, 2019 08:18 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల అర్బన్‌: నడిగడ్డలో మద్యం ఏరులై పారించిన డీకే అరుణ మహిళలకు క్షమాపణ చెప్పి మద్య నిషేధంపై ఉద్యమించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీకే బంగ్లా రాజకీయ పునాదులు మద్యం, లిక్కర్‌పైనే ప్రారంభమైందని ధ్వజమెత్తారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల చుట్టూ సుమారు 40 దాబాలు, బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా ఉండేవన్నారు. స్వయంగా తన చేతులమీదుగా దాబా లు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తి మద్యపాన నిషేధం అంటూ నాటకాలు ఆడితే ప్రజలు హర్షించర న్నారు. ప్రస్తుతం కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తం గా సుమారు 25 మద్యం షాపులు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి నడుపుతున్నారని, ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా మీడి యా ముందు వెల్లడించారని గుర్తుచేశారు. మ ద్యపాన నిషేధంపై ఉద్యమించడం తప్పు కాదని, అయితే మద్యం, లిక్కర్‌పై వారి రాజకీయ జీవితం ప్రారంభమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. నిజంగా మహిళలపై ప్రేమ, మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధి ఉంటే ముందు మీ భర్త నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దు చేసుకొని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్‌ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేశవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు