పేకాట స్థావరంపై పోలీసుల దాడి

17 Jul, 2015 16:45 IST|Sakshi

నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని శాంతినగర్‌లో ఓ పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.53 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు