కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం

14 May, 2018 08:52 IST|Sakshi
అంచనూరు సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

సాక్షి, దోమకొండ : కాళేశ్వరం నీటితో ఉత్తర తెలంగాణ లోని ఐదు జిల్లాల్లో భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని అంచనూరు, లింగుపల్లిల్లో ఆయన రైతుబంధు పథకం చెక్కు లు, పాస్‌బుక్కులను రైతులకు అందించి మాట్లాడారు. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పంటల పెట్టుబడికి అన్నదాతలు అప్పులు తీసుకోకుండా ఉండేందు కు ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు.

వచ్చే రెండేళ్లల్లో కాళేశ్వరం నీరు వస్తుందన్నారు. నగదు కొరత రాకుండా రిజర్వు బ్యాంకుతో మాట్లాడి సీఎం డబ్బులు బ్యాంకుల్లో అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తమ పంట దిగుబడులు పెంచి రాష్ట్ర పేరును దేశంలో ముందుంచాలన్నారు. రైతుల కోసం బబ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు. రైతు మర ణిస్తే రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ను అందిస్తామన్నా రు. జెడ్పీటీసీ మధుసూదన్‌రావ్, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కుంచాల శేఖర్, విండో చైర్మన్‌ నర్సారెడ్డి, గ్రామ సర్పంచ్‌లు లక్ష్మణ్, సైదు లింగం, ఎం పీటీసీ స్వామిగౌడ్, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావ్, సాయిరెడ్డి, చంద్రం, గోపి, చిన్న అంజయ్య, లక్ష్మయ్య,  తహసీల్దార్‌ సాయిభుజంగ్‌రావ్, ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, డీటీ తిర్మల్‌రావ్, వీఆర్‌వో నర్సింలు ఉన్నారు.  

ఇది రైతు రాజ్యం..
భిక్కనూరు: రామరాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాల్లో చదివామని ఇప్పుడు సీఏం కేసీఆర్‌ పాలన రైతు రాజ్యంగా మారిందని కళ్లారా చూస్తున్నామని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కాచాపూర్‌లో రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో మాట్లాడారు. గల్ఫ్‌కు వెళ్లినవారి భూములకు ఇచ్చే చెక్కులను వారి కుటుంబీకులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరానని రెండు రోజుల్లో ఈ విషయమై సీఎం కేసీఆర్‌ అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేస్తారన్నారు.

గత పాలకులు రైతులను నిర్లక్ష్యం చేయడంతోనే వ్యవసాయం కుంటుపడిందన్నా రు. ఇప్పుడు వ్యవసాయం అంటే పండుగ అనేలా ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీపీ తోగరి సుదర్శన్, డీసీసీబీ డైరెక్టర్‌ కిష్టగౌడ్, సర్పంచ్‌లు యాదయ్య, నర్సింహరెడ్డి, ఎంపీటీసీ కవిత, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్‌ మహేందర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్‌ జాంగారి రాజిరెడ్డి, నేతలు రాజాగౌడ్, అబ్బబాల్‌కిషన్, నీల శ్రీనివాస్, నీలంరెడ్డి, మల్లారెడ్డి, మురళి, సాయిరెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు